christian songs

Chemmagillu Kallalona Song Lyrics In Telugu

By  | 

Chemmagillu Kallalona Song Lyrics In Telugu

 

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
1.
నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె
నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
2.
అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే
మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *