devotional

Kanakavva Bathukamma Song Lyrics

By  | 

Kanakavva Bathukamma Song Lyrics

కొంగుల్లు సుట్టుండ్రే కోమలాంగి… కొనగొమ్మలొంచండ్రే సుందరాంగి
ఊయల్ల ఊగేటి పూవుల్ల గుత్తుల్ల… తల నిమిరి తెంపుండ్రే ఆగి ఆగి

తమ్ముళ్ళ పంపుండ్రే కోమలాంగి… అన్నల్ల పిలువండ్రే సుందరాంగి
అట్లట్ల తేలేటి అలుగుల్లు పోసేటి… సెరువుల్లో దుంకేరే లాగి లాగి

గుమ్మాడి పూలతో అరుగులు ఏద్దాము… గోరెంట పూలతో గోడలు కడదాము
దామెర పూలతో దర్వాజలేద్దాము… మొగిలిపూల తోటి మొగురాలు అల్లుదాము
వాయిలి పూలతో వాసాలు పరిసాక… పొన్న పూల ఇల్లు పొందించ్చుదాము

బండారితో ముద్దుగా పెట్టారే… బంగారి గౌరమ్మనే ఓయమ్మ
మందార పూవుల్లతో తల్లికి… సింధూరమే దిద్దరే మాయమ్మ

ఉసికెలో పుట్టావే ఉసికెల్లో పెరిగావే… ఉసికెల వసంతమాడేవే ఉసికెలోనే కలిసిపోతావే
మట్టి బొడ్డెమ్మ పసిరూపమే… కన్నతల్లి కంటిదీపమే పుట్టింటోళ్లకు ప్రాణమే

పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ… పందిరి బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ
పున్నమ నుంచి పెత్తరమాస… సెంద్రునోలే ఎదగవే బొమ్మ
తల్లి గుండెల్లున్న తండ్లాట జెప్పేదే… ఆట పాటలెనక అర్థమే గుమ్మా

శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ… సిత్రమై తోసెనమ్మా గౌరమ్మ
పెండ్లీడుకొచ్చినోళ్లు మాయమ్మ… నిండుగా నిను కొలుదురే గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ… సిత్రమై తోసెనమ్మా గౌరమ్మ
పెండ్లీడుకొచ్చినోళ్లు మాయమ్మ… నిండుగా నిను కొలుదురే గౌరమ్మ

కొంగుల్లు సుట్టుండ్రే కోమలాంగి… కొనగొమ్మలొంచండ్రే సుందరాంగి
ఊయల్ల ఊగేటి పూవుల్ల గుత్తుల్ల… తల నిమిరి తెంపుండ్రే ఆగి ఆగి
తమ్ముళ్ళ పంపుండ్రే కోమలాంగి… అన్నల్ల పిలువండ్రే సుందరాంగి
అట్లట్ల తేలేటి అలుగుల్లు పోసేటి… సెరువుల్లో దుంకేరే లాగి లాగి

తంగేడు పూవులన్నీ తళతళ మెరవంగా… గునుగు పూల ఒడిలో ఒరగంగా
కట్లపూల మెట్లు పరవంగా…
భామలు వచ్చేరే బంతులు తెచ్చేరే… శిబ్బిల బతుకమ్మ పేర్చేరే
తొమ్మిదొద్దుల ఆట ఆడేరే…

శ్రీకృష్ణుడొచ్చి పుంజీతమాడంగ… సత్యభామ డేగలాట లాడిందట
ఎంకటేసుడొచ్చి మోట గొట్టంగా… పద్మమ్మ మంగమ్మ నీళ్ళు దోడిండ్రట
ఎండి వాన పైడి వానల్లు కురవంగ… కొంగు సాపి నిన్ను పిలిసింది గంగ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జీవమున్న పల్లె ఉయ్యాలో… జీవిగంజి సెరువు ఉయ్యాలో

కొంగుల్లు సుట్టుండ్రే కోమలాంగి… కొనగొమ్మలొంచండ్రే సుందరాంగి
ఊయల్ల ఊగేటి పూవుల్ల గుత్తుల్ల… తల నిమిరి తెంపుండ్రే ఆగి ఆగి
తమ్ముళ్ళ పంపుండ్రే కోమలాంగి… అన్నల్ల పిలువండ్రే సుందరాంగి
అట్లట్ల తేలేటి అలుగుల్లు పోసేటి… సెరువుల్లో దుంకేరే లాగి లాగి

గుమ్మాడి పూలతో అరుగులు ఏద్దాము… గోరంట పూలతో గోడలు కడదాము
దామెర పూలతో దర్వాజలేద్దాము… మొగిలిపూల తోటి మొగురాలు అల్లుదాము
వాయిలి పూలతో వాసాలు పరిసాక… పొన్న పూల ఇల్లు పొందించ్చుదాము

బండారితో ముద్దుగా పెట్టారే…
బంగారి గౌరమ్మనే ఓయమ్మ…

మందార పువ్వుల్లతో తల్లికి… సింధూరమే దిద్దరే మాయమ్మ ||3||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *