christian songs

Yesayya Ninnu Chudalani Asha Lyrics in Telugu

By  | 

Yesayya Ninnu Chudalani Asha Lyrics in Telugu

యేసయ్యా…. నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా…. నిన్ను చేరాలని ఆశ
ఎవరు వున్నారు నాకు – ఈ లోకంలో
ఎవరు నాతోడు రారు – ఈ లోకంలో
ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా /2/యేసయ్య/
1. అందరు వున్నారని – అందరు నావారని /2/
తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని /2/
నా గానము నీవయ్యా – నా ధ్యానము నీవయ్యా
నా ప్రాణము నీవయ్యా – నా సర్వము నీవయ్యా /యేసయ్యా/
2. అంధకారములో అంధుడ నేనైతిని /2/
నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా /2/
నా ఆశ నీవయ్యా – నా ధ్యాస నీవయ్యా
నా శ్వాశ నీవయ్యా – నా భాష నీవయ్యా /యేసయ్యా /

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *